– అధ్యక్షుడిగా బండి మధు గౌడ్, ప్రధాన కార్యదర్శిగా కొలను భాస్కర్‌రెడ్డి
బీబీనగర్, ఏప్రిల్ 03 : బీబీనగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం గ్రామ బీఆర్ఎస్ నాయకుల ఆద్వర్యంలో సమావేశం నిర్వహించి గ్రామ శాఖ అధ్యక్షుడిగా బండి మధు గౌడ్, ప్రధాన కార్యదర్శిగా కొలను భాస్కర్రెడ్డిను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నూతన కమిటీ సభ్యులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొలను కృష్ణారెడ్డి, అందె యాదగిరి, శ్రీనివాస్ రెడ్డి, పెరుమాండ్ల అమరేందర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.