ఆలేరు టౌన్, జూలై 19 : రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం సికింద్రాబాద్ నుండి కాజీపేటకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుల కోరిక మేరకు ఆలేరు రైల్వే స్టేషన్లో ఆగిన ఆయనకు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, పట్టణాధ్యక్షుడు నంద గంగేశ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ పలు సమస్యలను పరిష్కరించాల్సిందిగా రైల్వే మంత్రిని కోరారు.
ఆలేరు రైల్వే అండర్ పాస్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి, గుండ్లగూడెం గేటు వద్ద అండర్పాస్ మంజూరు అలాగే ఆలేరు రైల్వే స్టేషన్లో పలు రైళ్లను ఆపాలని కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పూజారి కుమార్, బడుగు జాంగిర్, కామిటికారి కృష్ణ, చిరిగే శ్రీనివాస్, బైరి మహేందర్ గౌడ్, పార్టీ వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.