బీబీనగర్, మే 08 : ఎస్‌హెచ్‌జీ బ్యాంక్ లింకేజీలో 2024-2025 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయిలో యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ఉత్తమ మండలం, ఉత్తమ ఏపీఎంగా బీబీనగర్ ఎంపికైనట్టు ఏపీఎం శ్రీనివాస్ గురువారం తెలిపారు. 2024-2025 వార్షిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్దేషించిన (100 శాతానికి 115 శాతం రుణాలు మంజూరు చేసి ) రూ.53 కోట్ల రుణాలకు గాను లభ్దిదారులకు రూ.63 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు.
రుణాల మంజూరు అనంతరం రుణాల చెల్లింపులో కూడా 0.05 శాతం ఎన్పీఏతో ముందు వరుసలో ఉన్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే ప్రగతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క చేతులమీదుగా అవార్డు అందుకున్నట్టు తెలిపారు. మండలానికి అవార్డు రావడానికి కృషి చేసిన సీసీ, వీఓఏ, ఎస్‌హెచ్‌జీ సభ్యులు, బ్యాంక్ మేనేజర్లకు కృతజతలు తెలిపారు.