Bhuvanagiri : సమస్యలు తీర్చడం కోసమే ముందుకు.. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

భువనగిరి అర్బన్ : గ్రామాల్లోని ప్రజా సమస్యలు తీర్చడం కోసమే మీ ముందుకొస్తున్నానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. పల్లె పర్యవేక్షణలో భాగంగా ఉదయం 8 గంటలకు మండలంలోని చీమలకొండూర్, ముస్త్యాలపల్లి గ్రామాల్లో మంగళవారం పర్యటించి గ్రామంలోనే ప్రజలతో కలిసి టీఫిన్ చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ప్రతి వార్డులో సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తానన్నారు. ప్రతి ఇంటి నుంచి వచ్చిన మురుగునీరు కన్పించకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తాగునీటి సమస్య తీర్చడం, శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలను తొలగించి నూతన స్తంభాలు ఏర్పాటు చేయడంతో పాటు వార్డులను సుందరీకరణ మార్చేందుకు కృషి చేస్తానన్నారు. వార్డులను కలియ తిరిగి డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మాణాలకు కొలతలు తీసి అంచన వేయించారు.
గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో వృద్ధులు అడిగిన సమస్యలను సొంత నిధులతో చేస్తానని హామీ ఇచ్చారు. వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెల్లే దారిలో కల్వర్టును ఏర్పాటు చేయిస్తానని రైతులకు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేశ్‌గౌడ్, ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామియాదవ్, జడ్పీటీసీ సుబ్బూరు బీరు మల్లయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జనగాం పాండు, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

