‘భువనగిరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను వెంటనే ప్రారంభించాలి’
మాజీ సీఎం కేసీఆర్ చొరవతో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణ పనులు అన్ని పూర్తయిన నేటికీ ప్రారంభానికి నోచుకోలేదని, నెల రోజుల్ఓ ప్రారంభించకుంటే వీధి వ్యాపారులతో..
– లేకపోతే వీధి వ్యాపారులతో ప్రారంభం చేయిస్తాం
– బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఏవీ.కిరణ్‌కుమార్
భువనగిరి అర్బన్, జూన్ 13 : మాజీ సీఎం కేసీఆర్ చొరవతో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణ పనులు అన్ని పూర్తయిన నేటికీ ప్రారంభానికి నోచుకోలేదని, నెల రోజుల్ఓ ప్రారంభించకుంటే వీధి వ్యాపారులతో ప్రారంభం చేయిస్తామని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏవి.కిరణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను శనివారం పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా ఏవి.కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. పట్టణంలో వీధి వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను అన్ని వసతులతో నిర్మించడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాల కాలం గడిచిపోయిన ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంతో వీధి వ్యాపారులకు శాపంగా మారిందన్నారు.
నిర్మించిన భవనంలోని ఎలక్ట్రికల్ వైర్లు, ప్రహారికి నిర్మించిన గ్రిల్స్ ను కట్ చేసి దొంగలించిన వస్తువుల విలువ సుమారూ రూ.25 లక్షలని మున్సిపల్ కమిషనర్, పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు దర్యాప్తునకు నోటుకోలేదన్నారు. భువనగిరి ఎమ్మెల్యే అతడి క్యాంప్ కార్యాలయ ఆవరణలోనే ఉన్నా కూడా మార్కెట్‌ను పరిశీలించకపోవడం, దానిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తూ ఉంటే భువనగిరి పట్టణంపై అతనికి ఉన్న ప్రేమ నామ మాత్రమే అని పట్టణ ప్రజలకు అనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

