కేతేపల్లి, జూలై 18 : ఏండ్ల తరబడి పెండిండ్లో ఉన్న రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతిని ప్రవేశ పెట్టిందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు ఎం.సునీల్ తెలిపారు. సాగు న్యాయ యాత్రలో భాగంగా కేతేపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం భూ సమస్యలపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భూ భారతి చట్టంలోని పలు అంశాల గురించి ఆయన రైతులకు వివరించారు. రికార్డుల నుండి తొలగించిన భూములు, కోర్టు పరిధిలో పరిష్కారం కాకుండా ఉన్న భూములపై రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయాధికారి బి.పురుషోత్తం, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.