ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ అనురాగ్ జయంతి
ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం భువనగిరి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని కలెక్టర్ తనిఖీ చేశారు.
భువనగిరి అర్బన్, జూన్ 16 : ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం భువనగిరి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని కలెక్టర్ తనిఖీ చేశారు. జిల్లాను మోడల్ జిల్లాగా ఎంపిక చేసినందుకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో భాగంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్లో నమోదు సంఖ్య పెంచాలని ఆదేశించారు. ఆస్పత్రిలో శానిటేషన్, బ్లడ్ బ్యాంక్, నవజాత శిశువు ప్రత్యేక సంరక్షణలో అందిస్తున్న సేవలు, బాలింత తల్లులకు, పిల్లలకు అందుతున్న సేవలు, ల్యాబ్ లో అందిస్తున్న పరీక్షల వివరాలు, టీ హబ్ లో అందుతున్న సేవల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో పని చేస్తున్న ఉద్యోగులు, ల్యాబ్ టెక్నీషియన్స్ భర్తీ చేయుటకు అవకాశాలు గురించి తెలుసుకున్నారు.
ఆస్పత్రి అభివృద్ధి సంఘం సమావేశం నిర్వహించేందుకు తేదీని నిర్ణయించాలని ఆదేశించారు. ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది సమయానికి వస్తున్నారా అడిగి తెలుసుకున్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ప్రతి రోజు ఇన్ పేషెంట్, ఔట్ పేషంట్ ఎంతమంది పేషంట్లు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని వార్డులను పరిశీలించారు. వార్డులో చికిత్స పొందుతున్న పేషెంట్లను, వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ కె.అరుణకుమారి, డాక్టర్ ఏ.జయలక్ష్మి, సహాయ సంచాలకులు, నర్సింగ్ ఆఫీసర్స్, వివిధ శాఖల అధికారులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

