మోటకొండూరు, అక్టోబర్ 13 : పోషకాహారమే ఆరోగ్యానికి బలమని, పోషకాహారంతోనే మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని ఆలేరు ప్రాజెక్ట్ సీడీపీఓ స్వరాజ్యం అన్నారు. పిల్లల ఆరోగ్యంపై ప్రతి తల్లి శ్రద్ధ పెట్టాలన్నారు. తక్కువ ఖర్చుతోనూ పోషక విలువలున్న ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండవచ్చునని తెలిపారు. సోమవారం మోటకొండూరు మండల కేంద్రంలోని అంగన్ వాడీలో పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా గర్భిణీలు, తల్లులకు పోషకాహారంపై ఆమె అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లి పాల ప్రయోజనాలు, పోషకాహారం ప్రాముఖ్యత వంటి అంశాలపై అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు జ్యోతి, జంగమ్మ, రమణ, అంగన్వాడీ టీచర్లు శోభ, సిద్దమ్మ, రాధిక, అనురాధ, రాణి, భాగ్యలక్ష్మి, గర్భిణీలు, తల్లులు పాల్గొన్నారు.