చౌటుప్పల్, అక్టోబర్ 16 : చౌటుప్పల్ మున్సిపాలిటీ రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షుడిగా మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామానికి చెందిన కానుగు బాలరాజు ఎన్నికయ్యారు. నియామకపు పత్రాన్ని గురువారం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రజక వృత్తిదారుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం వృత్తిదారుల సంక్షేమానికి కృషి చేయాలని, ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని పేర్కొన్నారు.