భువనగిరి కలెక్టరేట్, జూలై 18 : బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాలకృష్ణ ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. భువనగిరి మండలంలోని కూనూరు గ్రామ మాజీ సర్పంచ్ డోకె బాలకృష్ణ గుండెపోటుతో మృతిచెందారు. ఆయన భౌతికకాయాన్ని శుక్రవారం పైళ్ల శేఖర్‌రెడ్డి సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొలుపుల అమరేందర్, మండలాధ్యక్షుడు జనగాం పాండు, మాజీ జడ్పీటీసీ సుబ్బూరు బీరు మల్లయ్య, ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాశ్‌గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య,
నాయకులు బల్గురి మధుసూదన్‌రెడ్డి, అబ్బగాని వెంకట్‌గౌడ్, కేశపట్నం రమేశ్, కస్తూరి పాండు, పుట్ట వీరేశం, కంకల కిష్టయ్య, నోముల మహేందర్‌రెడ్డి, రాసాల మల్లేశం, రేగు వెంకటేశ్, బోయిని పాండు, చిన్నం పాండు, జమ్ముల రమేశ్, పాశం మహేశ్, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, ఇట్టబోయిన గోపాల్, అంకర్ల మురళీకృష్ణ, ముల్లె నాగేంద్రబాబు, పాశం మహేశ్, కమ్మగాని నరసింహ, భువనగిరి ఎల్లయ్య, పల్లెర్ల జహంగీర్, కంకల మహేశ్, సుర్వి గణేశ్, సుర్వి సంపత్, ఏర్పుల అరవింద్, వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు ఉన్నారు.