బీబీనగర్, ఏప్రిల్ 14 : కమ్యూనిటీ రీహాబిలిటేషన్ కార్యక్రమాల ద్వారా దివ్యాంగులకు అవసరమైన సేవలపై అవగాహన పెంపొందుతుందని బీబీనగర్ గ్రామ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాటలు రాని వారు, వినికిడి లోపం ఉన్న దివ్యాంగులకు అవసరమైన సేవలు అందించేందుకు అలి యావర్ జంగ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిజబిలిటీస్ ఆధ్వర్యంలో మంగళవారం బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో కమ్యూనిటీ బేస్డ్ రీహాబిలిటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
గ్రామంలోని మాటలు రాని వారు, వినికిడి లోపం ఉన్న దివ్యాంగులకు అవసరమైన సేవలు, సదుపాయాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎండీ జాకీర్, మాజీ ఎంపిటిసి గోలి నరేందర్ రెడ్డి, వార్డు సభ్యులు మంగ అశోక్, పంజాల ప్రవీణ్ గౌడ్, కట్ట వినోద్, సోమశివకుమార్, నెల్లుట్ల శ్రీశైలం, బుర్రి సుదర్శన్, దేవరప్పల పృధ్వీ, నాయకులు ఆకుల రవీందర్, పిట్టల శ్రీనివాస్, పాశం మైపాల్, ఓబుల్ దాస్ మహేష్, ఆకులు సాయి కుమార్, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.