యాదగిరిగుట్ట, జూలై13 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారిసేవలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారథి పాల్గొని తరించారు. ఆదివారం కుటుంబ సమేతంగా యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ప్రధానాలయంలోకి చేరుకున్న ఆయన గర్భాలయంలోకి వెళ్లి స్వయంభూ పంచనారసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సంప్రదాయ స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు, వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేయగా ఆలయ డీఈవో దోర్బల భాస్కర్ స్వామివారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.