మోటకొండూర్, అక్టోబర్ 06 : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ మోటకొండూర్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య, నార్మూల్ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తుల పేర్లను నమోదు చేసుకున్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మాజీ మండలాధ్యక్షుడు దూదిపాల రవీందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జెట్ట మహేశ్వర్, బైరోజు వెంకటాచారి, పైళ్ల సత్యనారాయణ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బాల్ద లింగం, మాజీ ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి, నాయకులు నాయిని రామచంద్రారెడ్డి, బురాన్, అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు.