యాదాద్రి భువనగిరి: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు, అఖిలపక్షం తెలంగాణ బంద్‌కి పిలుపనిచ్చిన నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri) కేంద్రంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. భువనగిరి బస్టాండ్ బస్సులు లేక బోసిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికులు తమ గమ్య స్థనాలకు చేరుకోవటానికి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేశారు. కొన్ని తెరచిన వ్యాపార సముదాయాలను వివిధ పార్టీల నాయకులు మూసి వేయించారు. తెలంగాణ బంద్‌కి మద్దతుగా భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో వేరువేరుగా బైక్ ర్యాలీ నిర్వహించారు.