బీబీనగర్, మే 09 : సమగ్ర నీటి పారుదలతోనే వ్యవసాయాభివృద్ధి సాధ్యమవుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మహమ్మద్ ఖుర్షీద్ మొయినుద్దీన్ అన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాలను పురస్కరించుకుని నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో బీబీనగర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు ఆవరణలో శనివారం రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటి వనరుల సంరక్షణ అవసరాన్ని వివరించారు. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. చెరువుల పూడికతీత చేపట్టడం ద్వారా భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగునీటి లభ్యత మెరుగుపడుతుందని తెలిపారు. చెరువుల పరిరక్షణతో వ్యవసాయ రంగానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎర్రోళ్ల వెంకటస్వామి, ఏఈ గిరిజన్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

‘సమగ్ర నీటి పారుదలతోనే వ్యవసాయాభివృద్ధి’