రాజాపేట, మార్చి 20 : విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి డీఎంహెచ్ఓ మనోహర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ సుమన్ కళ్యాణ్ వైద్య సిబ్బందిని హెచ్చరించారు. శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల హాజరు రిజిస్టర్, ఓపి నమోదు రికార్డులను పరిశీలించారు. సెలవు పెట్టకుండా విధులకు హాజరు కాకపోతే చర్యలు తప్పవన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచాలన్నారు. దవాఖానలో అందుతున్న వైద్య సేవలపై డాక్టర్ మోజేస్ రాజ్ ను అడిగి తెలుసుకున్నారు.