యాదాద్రి భువనగిరి : ఏం సమస్య వచ్చిందో ఏమో తెలియదు కానీ ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని సంస్థాన్ నారాయణపూర్ మండలం లింగన్వారిగూడెంకు చెందిన మేకల వెంకటేశం (38) అనే వ్యక్తి వ్యవసాయ పొలంలో ఉరి వేసుకుని చనిపోయాడు. బుధవారం ఉదయం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి సంస్థాన్ నారాయణపూర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేశం మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.