International Womens day | ఆలేరు టౌన్, మార్చి 8 : సృష్టికి జీవం పోసేది, సృష్టికి మూలం మహిళ అని ఆలేరు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మొరిగాడి మాధవి వెంకటేష్ అన్నారు. ఆలేరు పట్టణ కేంద్రం క్రాంతి నగర్లోని తన నివాసంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుగూ.. మహిళలు చదువుకున్నప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తారని చెప్పారు.
నేటి సమాజంలో మహిళల పాత్ర కీలకమని అన్నారు. మహిళల అభ్యున్నతి కోసం సావిత్రిబాయి పూలే, ఝాన్సీ లక్ష్మీబాయి, మదర్ తెరిసా, చాకలి ఐలమ్మ మొదలగు వారు చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకొని మహిళలు ముందుకు నడవాలని కోరారు. సమాజంలోని మహిళలపై దాడులు జరగకుండా ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో శ్యామల సోనీ, అశ్విని చైత్ర, లావణ్య, అర్చన, నవ్య, సంధ్య,స్వాతి నార్మడా వాణిశ్రీ, గీత స్వాతి దిశా అరుణ, లుబనా, లక్ష్మి, హేమలత తదితరులు పాల్గొన్నారు.
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్