నీలగిరి, ఫిబ్రవరి 7 : నల్లగొండ ఓల్డ్ సిటీలో గులాబీ గుబాళించింది. పాత బస్తీలోని నాలుగు డివిజన్లలో వేలాది మంది గులాబీ సైనికులు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ప్రచార కార్యక్రమంలో ఆయనకు జనం అడుగడుగునా నీరాజనం పట్టారు. జనహోరు, డప్పు చప్పుళ్లతో పాతబస్తీ ప్రాంతమంతా దద్దరిల్లింది. కేసీఆర్ పాటలు, కోలాటలతో వేలాది మంది మహిళలు ఉత్సాహంగా కదిలారు. కార్యకర్తలు, మహిళలు బాణ సంచా కాలుస్తూ, కారు గుర్తుకు ఓటేస్తామంటూ నినదించారు.
కేసీఆర్, కేటీఆర్‌పై పాడిన పాటలకు యువత నృత్యం చేస్తూ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తామని ప్రతిన బూనారు. ఈ సందర్భంగా ముఖ్య కూడళ్లలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల ప్రసంగించారు. తాను ఎమ్మెల్యేగా గెలవకముందు నల్లగొండ ఎట్లుందో.. ఇప్పుడు ఎట్లుందో మీరే చూడాలన్నారు.
ఇరుకు సందులు, వాహనాలు వస్తే ట్రాఫిక్ ఇబ్బంది, వానలు వస్తే మురికి గుంటలు, కరెంటు లేక, పాములు, తేళ్లతో జనం ఆరిగోస పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి నల్లగొండ అభివృద్ధికి ఏం చేశాడో.. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న తాను ఏం చేశానో జనం కండ్ల ముందే ఉందన్నారు. ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించి, రూ. కోట్ల నిధులు తెచ్చి అన్ని వీధుల్లో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులు పూర్తి చేశానన్నారు. ఏదో మంచి చేస్తారని భారీ మెజారిటీతో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆ పార్టీ నాయకులు నల్లగొండ పరువు తీస్తున్నారన్నారు. కేసీఆర్ నల్లగొండను దత్తత తీసుకొని రూ.1500 కోట్లతో సుందర నగరంగా తీర్చి దిద్దారన్నారు.
పట్టణ పరిధిలోని 12వ డివిజన్ పరిధిలోని మాధవ్నగర్కు చెందిన జహంగీర్, రియాజ్, లతీఫ్,కరిముల్లా అద్వర్యంలో సుమారు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కంచర్ల భూపాల్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, బీఆర్ఎస్ పార్లమెంట్ ఇంచార్జ్ కంచర్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థులు పెరిక కరణ్ జయరాజు, కునుకుంట్ల మంజుల నాగరాజు, అభిమన్యు శ్రీనివాస్, జమాల్‌ఖాద్రీ, ఎన్.నాజ్నిన్ ఓవెజ్ షాహ్,మహ్మద్ ఆశ్వాక్ అహ్మద్,మాతంగి ఉమాదేవి,జహంగీర్ బాబా,మారగోని భవానీగణేష్, చిన్నాబత్తిని జ్ఞానసుందరమ్మ జయప్రకాశ్, నందికొండ శ్రీను, బాణోతు దీప్లా, బీఆర్ఎస్ నాయకులు పేర్ల హనుమాన్‌ప్రసాద్, నల్లబోతు వెంకన్న, పండుగ నగేష్, ఉడుత చిన్నవెంకన్న, ఎడ్లసైదులు డాక్టర్ చారి, శేఖర్‌రెడ్డి, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.