దేవరకొండ, జనవరి 13 : అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పైప్ లైన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ తెలిపారు. మంగళవారం లిఫ్ట్ ఇరిగేషన్లో భూములు కోల్పోయిన పెద్ద అడిశర్లపల్లికి చెందిన 41 మంది రైతులకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సుమారు రూ.53 లక్షల విలుగ గల చెక్కులను అందజేసి మాట్లాడారు. ఏకేబీఆర్ లిఫ్ట్‌తో 6,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, ఇరిగేషన్ డీఈ నాగయ్య, ఏఈ శిల్ప, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, వెంకట్ రెడ్డి, హరి, కిషన్ పాల్గొన్నారు.