– బిజెపి చండూరు మున్సిపల్ అధ్యక్షుడు పందుల సత్యం గౌడ్
చండూరు, జనవరి 12 : స్వామి వివేకానందుడి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ భరత మాత సేవలో తరించాలని బిజెపి చండూరు మున్సిపల్ అధ్యక్షుడు పందుల సత్యం గౌడ్ అన్నారు. సోమవారం స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా చండూరు మున్సిపాలిటీ మెయిన్ సెంటర్లో ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వివేకానంద పేరు స్మరిస్తేనే ఆధ్యాత్మికత, ధైర్యం గుండెల్లో నిండిపోతాయన్నారు. “బలమే జీవనం బలహీనతే మరణం” అని ఆయన చెప్పిన మాటలు అక్షర సత్యాలని, ధైర్యముంటే ఎంతటి కష్టమైనా ఎదుర్కోవచ్చన్నారు. 39 ఏండ్ల వయసులోనే భారత దేశ కీర్తి ప్రతిష్టలు, సంస్కృతీ సంప్రదాయాలు ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత శక్తి స్వామి వివేకానందుడని, భూమిపై నడయాడిన దైవాంశ సంబూతుడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బిజెపి చండూరు మండల అధ్యక్షుడు, చామలపల్లి సర్పంచ్ ముదిగొండ ఆంజనేయులు, జోగిగూడెం ఉప సర్పంచ్ పెండెం ఉపేందర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు భూతరాజు శ్రీహరి, జిల్లా నాయకులు సముద్రాల వెంకన్న, బోడ ఆంజనేయులు, అన్నెపర్తి యాదగిరి, కళ్లెం సురేందర్ రెడ్డి, పేర్ల గణేశ్, బిజిలి యాదయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శులు భూతరాజు స్వామి, సోమ శంకర్, ఆవుల అశోక్ యాదవ్, పడ్సనబోయిన శ్రీను, నాయకులు తిరందాసు శ్రీను, తడకమళ్ళ శ్రీధర్, కోమటి ఓంకారం, జిట్టగోని బాలు, చెనగాని శేఖర్, బొబ్బల శివకుమార్, మన్యం ప్రవీణ్, భూతరాజు శంకర్, దోటి కిరణ్, భూతరాజు వేణు, సంగెపు నరేష్, నకరికంట శ్రీను, తడికంటి రాజు, రావిరాల మారుతి, చిన్నగాని వినోద్, జిట్టగోని రాము, గండూరి శివ పాల్గొన్నారు.