– మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు
మిర్యాలగూడ, ఫిబ్రవరి 2 : మిర్యాలగూడలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. సోమవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సీతారాంపురం 42వ వార్డు మాజీ కౌన్సిలర్ చీదెళ్ల సత్యవేణి వెంకటేశ్వర్లు దంపతులు తిరిగి సొంతగూడైన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు వారికి గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. ఈ 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో మిర్యాలగూడ పట్టణంలోని అనేక వార్డుల్లో పోటీ చేసే అభ్యర్ధులు దొరక్క కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటుందని విమర్శించారు. పార్టీ ఆలోచనకు, ప్రజాసేవకు నిబద్ధత కలిగిన నాయకులు బీఆర్ఎస్లో చేరడం పార్టీ బలాన్ని మరింత పెంచుతుందన్నారు. పట్టణంలో బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయడంలో చీదెళ్ల దంపతులు కీలకపాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై నమ్మకంతో గతంలో జరిగిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల అమలు ఫలితంగా రాష్ట్ర ప్రజలు గులాబీ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. బీఆర్ఎస్తోనే మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమన్నారు. 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, రాష్ట్ర నాయకుడు నల్లమోతు సిద్ధార్థ, కట్టా మల్లేష్ గౌడ్, రెడ్డికాలనీ అభ్యర్థి గుడుగుంట్ల శరణ్య, రేపాల అనంత్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి, ఎలుగుబెల్లి నాగరాజు, కోల నాగరాజు, జెర్రిపోతుల గిరిబాబు, పరమేష్, రామావతారం పాల్గొన్నారు.

Nallamothu Bhaskar Rao : ‘బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలి’