నకిరేకల్, నవంబర్ 06 : బీసీలంతా ఐక్యంగా ఉద్యమించి హక్కులను సాధించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం నకిరేకల్ పట్టణంలో ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు నకిరేకల్ మున్సిపాలిటీ పట్టణ బీసీ యువజన సంఘం అధ్యక్షుడిగా నకిరేకల్ పట్టణానికి చెందిన వేమవరపు ప్రవీణ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి నూనె కోటి, నాయి బ్రాహ్మణ సేవా సంఘం నకిరేకల్ నియోజవర్గ అధ్యక్షుడు మేడిపల్లి సైదులు, రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పగిళ్ల వెంకన్న, బీసీ స్టూడెంట్ అసోసియేషన్ నకిరేకల్ నియోజవర్గ అధ్యక్షుడు నితిన్ మహేంద్ర పాల్గొన్నారు.