కట్టంగూర్, మార్చి 24 : గ్రామాల అభివృద్ధే ధ్యేయమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని పామనుగుండ్ల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.15 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. నియోజకవర్గానికి అధిక నిధులు తెచ్చి దశలవారీగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుప్తా మంజుల మాధవరెడ్డి, ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞాన ప్రకాశ్‌రావు, మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ, మాజీ ఎంపీపీ రెడ్డిపల్లి వెంకటమ్మ సాగర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బండారు కృష్ణ, గుండు పరమేశ్, పంచాయతీ కార్యదర్శి జయసుధ, నాయకులు కొరివి యాదగిరి కుంభం అనిల్‌రెడ్డి, కనుకుల ధర్మారెడ్డి, మిట్టపల్లి శివ, రెడ్డిపల్లి స్వామి, మర్రి రాజు, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.