చండూరు, ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామంలో మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో నడిచి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తితో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి తాగునీరు, కరెంట్ నిరంతరాయంగా వచ్చేవని కానీ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి పర్యవేక్షణ లోపం వల్ల చాలా ఇండ్లకు కృష్ణా జలాలు రావడం లేదన్నారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలన్నారు. రైతులు వరి ధాన్యం కోసిన తర్వాత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో ప్రజలకు అన్ని కష్టాలే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ తో గాని సంబంధిత మంత్రులతో గాని మాట్లాడి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, చండూరు మాజీ జడ్పిటిసి కర్నాటి వెంకటేశం, సర్పంచ్ బొమ్మల సుగుణమ్మ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రం మాధవి వెంకటరెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, పార్టీ మండల అధికార ప్రతినిధి బొడ్డు సతీష్, యువజన అధ్యక్షుడు ఉజ్జిని అనిల్ రావు, నాయకులు ఎత్తపూ మధుసూదన్ రావు, మండల మాజీ అధ్యక్షుడు పెద్దగోని వెంకన్న, గ్రామ శాఖ అధ్యక్షుడు కట్కూరీ సత్తయ్య, ఉప సర్పంచ్ సరీకొండ ముత్యాలు, అంబేద్కర్ విగ్రహ నిర్వాహకులు పందుల రాజు, బొమ్మల సురేష్, బొల్లెద్దు శశిధర్, పందుల రమేష్, బొల్లెద్దు వెంకటేష్, పందుల రవి, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

అంబేద్కర్ విగ్రహావిష్కరణ అదృష్టం : మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి