నల్లగొండ సిటీ, జనవరి 22 : ఆర్టీసీలో యూనియన్లు అనుమతించి ఎన్నికలు నిర్వహించాలని, విద్యుత్ బస్సుల విధానంలో ఆర్టీసీకి అవకాశం కల్పించాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిపో గౌరవాధ్యక్షుడు, సిఐటియు నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, రీజియన్ అధ్యక్షుడు కందుల నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా డిపోలో డిమాండ్స్ డేలో భాగంగా బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీజీఎస్ఆర్టీసీలో యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు ఎన్నికలు జరపాలన్నారు. కేంద్రం తెచ్చిన 4 లేబర్ కోడ్ లను రాష్ట్రంలో అమలు చయబోమని రాష్ర్ట ప్రభుత్వం తీర్మానం చేసి పంపాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బస్ ల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీలకు అవకాశం కల్పించాలన్నారు. ప్రజలు, ఆర్టీసీపై భారాలు మోపే విద్యుత్ సవరణ బిల్లు 2025 ఉప సంహరించుకోవాలని కోరారు. రిటైర్డ్ అయిన వారికి రావాల్సిన అన్ని రకాల బకాయిలను వెంటనే చెల్లించాలని, ఎం వి యాక్ట్ 2019 లో సవరణలు చేయాలని కోరారు.
2021, 2025 వేతన ఒప్పందాలను చేయాలని. 2017 వేతనాల ఆధారంగా అలవెన్సులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. W S & M I S స్కీమ్ లలో రిక్రూట్మెంట్ అయిన పిల్లలకు ఆర్టీసీలో వెంటనే ఉద్యోగాలు కల్పించాలని, హైర్ పింఛన్ వసతులకు సంబందించిన డిమాండ్ లెటర్ రాక కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారని బస్ భవన్లో వీరి సమస్యలను ఆర్టీసీ అధికారులు పరిస్కరించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు సంవత్సరాల నుండి రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్ డబ్బులు రాక అనేక అవస్థలు పడుతున్నారన్నారు. ఔట్ సోర్సింగ్, కాట్రాక్టు వ్యవస్థలను పూర్తిగా రద్దు చేయాలన్నారు. కార్మికులకు ఎప్పుడు అడిగినా కూడా లీవులు ఇవ్వడం లేదన్నారు.
పని గంటల పెంపు అధికం అవుతున్నది, ఎలాంటి పొరపాటు లేకున్నా అనవసర డిపో స్పెర్స్ పెట్టి సత్తాయిస్తున్నట్లు తెలిపారు. గ్యారేజ్ కార్మికులకు పనిముట్లపై సరైన స్పేర్ పార్ట్స్ లను కల్పించటం లేదన్నారు. పై డిమాండ్ ల సాధన కోసం ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ &వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రీజియన్ సహాయ కార్యదర్శి కె.శ్యాంసుందర్, డిపో అధ్యక్షుడు ఎం. నరసింహయ్య, విజయ్, మాధవి, శ్రీకాంత్, పుల్లయ్య పాల్గొన్నారు.