కట్టంగూర్, మే 12 : కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైనా అరెస్టు చేయకపోవడంపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం కట్టంగూర్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసి తరాల బలరాములు మాట్లాడుతూ.. పోక్సో కేసు నమోదు చేసి రోజులు గడుస్తున్నా నిందితుడిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని ఆరోపించారు. సాయి భగీరథపై తూతూ మంత్రంగా పోక్సో కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడం కాకుండా హోంశాఖ ఈ కేసు విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే బాధితురాలికి ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అయిటిపాముల సర్పంచ్ బెల్లి సుధాకర్, నాయకులు పోగుల నర్సింహ్మ, వడ్డె సైదిరెడ్డి, పనస సైదులు, పెద్ది బాలనర్సయ్య, అంతటి శీను, జిల్లా యాదయ్య, రాచకొండ యాదయ్య, గోగు సైదులు, తిరుమలేష్, నల్ల మాద సైదులు, నోముల వెంకటేశ్వర్లు, ఊట్కూరు సైదులు, బండారు విజయ్ కుమార్ పాల్గొన్నారు.