తుంగతుర్తి, ఏప్రిల్ 27 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామానికి చెందిన చింతకుంట్ల పున్నమ్మ సోమవారం ఉదయం తన ఇంటి దగ్గర ఉన్న మోటార్ వేయడానికి ప్లగ్ కరెంట్ బోర్డులో పెడుతుండగా ఒక్కసారిగా షాక్కు గురై కిందపడిపోయింది. స్థానికులు గమనించి పున్నమ్మను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు తెలిపారు. పున్నమ్మకు భర్త రామచంద్రు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇరువురి కూతుర్లకు పెళ్లిళ్లు అయ్యాయి.
తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో వడదెబ్బ తగిలి మహిళ మృతి చెందింది. కొత్తగూడెం గ్రామానికి చెందిన మల్లెపాక నిర్మల (43) మిరప తోటలో కూలికి వెళ్లి తీవ్ర ఎండ దెబ్బ తగిలి సోమవారం తెల్లవారుజామున దాదాపు 2 గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. నిర్మల మృతితో గ్రామంలో విషాద చాయాలు అలుముకున్నాయి.

విద్యుత్ షాక్తో ఒకరు.. వడదెబ్బతో మరో మహిళ మృతి