పట్నా, ఆగస్టు 18: బీహార్‌లో టీచర్స్ రిక్రూట్మెంట్పై అభ్యర్థులు ఆందోళనబాట పట్టారు. పరీక్ష నోటిఫికేషన్ 24 గంటల్లో విడుదల చేయాలని, లేదంటే రాష్ట్ర విద్యామంత్రి ఇంటిని ముట్టడిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం టీచర్ల నియామకానికి హఠాత్తుగా మంగళవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఉపాధ్యాయుల నియామక పరీక్షకు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా 32,388 పోస్ట్‌లను భర్తీ చేయనున్నట్టు తెలిపింది. పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 1న ప్రారంభమవుతుందని పేర్కొంది.