Farmers Protest | కరెంట్ కోసం రామాయంపేటలో రైతుల రాస్తారోకో.. రెండు గంటలు స్తంభించిన ట్రాఫిక్
Farmers Protest | వ్యవసాయానికి కనీసం 8 గంటల విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. రామాయంపేట–ఎల్కతుర్తి జాతీయ రహదారిపై విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతులు బైఠాయించి నిరసన తెలిపారు.
Farmers Protest | వ్యవసాయానికి కనీసం 8 గంటల విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. రామాయంపేట–ఎల్కతుర్తి జాతీయ రహదారిపై విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది.
ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉందని, ఈ సమయంలో నీరు అందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 8 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నా.. ఎప్పుడు సరఫరా నిలిచిపోతుందో, ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియని పరిస్థితి ఉందన్నారు. విద్యుత్ సరఫరాను నిరంతరాయంగా అందించాలని పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాను సక్రమంగా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల రాస్తారోకోతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్సై బాలరాజు అక్కడకు చేరుకుని రైతులను సముదాయించి, ఆందోళనను విరమింపజేశారు. అనంతరం ట్రాఫిక్ పునరుద్ధరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

