NEET-UG question paper leak | ఢిల్లీ పోలీసులను కీర్తించ వద్దా?.. విద్యార్థి నిరసనలపై రిజిజు నిలదీత
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజ్‌కి వ్యతిరేకంగా ఇటీవల ఢిల్లీలో జరిగిన విద్యార్థి నిరసనల సందర్భంగా వారిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 18: నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజ్‌కి వ్యతిరేకంగా ఇటీవల ఢిల్లీలో జరిగిన విద్యార్థి నిరసనల సందర్భంగా వారిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. విద్యార్థి నిరసనకారులు ఢిల్లీలో జూలై 20న చేపట్టిన చలో పార్లమెంట్‌ను మంగళవారం నాడిక్కడ విలేకరుల వద్ద ప్రస్తావిస్తూ పరిస్థితులను అత్యంత శాంతియుతంగా నిర్వహించినందుకు పోలీసులను అభినందించాలని ఆయన అన్నారు.
విద్యార్థుల ముసుగులో కొందరు నేరస్థులు ఆందోళనలో చేరినప్పటికీ నిరసనలను సమర్థవంతంగా ఎదుర్కొన్నందుకు ఆయన ఢిల్లీ పోలీసులను, ఇతర అధికారులను కూడా ప్రశంసించారు. నిరసనల సందర్భంగా భద్రతా దళాలు తుపాకులను ఉపయోగించాయన్న ఆరోపణలను ప్రస్తావించగా ఎక్కడ కాల్పులు జరిగాయి? ఒక్క వ్యక్తి కూడా చనిపోలేదు, ఎవరికీ ఎముకలు విరగలేదు. ఎవరూ తీవ్రంగా గాయపడలేదు అని రిజిజు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

