మునుగోడు, మార్చి 19 : రాష్ట్రంలో ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించిన ప్రభుత్వం ఆ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించింది. ఇందుకు సంబంధించి సోమవారం మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టిన ‘తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు (రిజర్వేషన్ల హేతుబద్దీకరణ) బిల్లు-2025’ను మంగళవారం అసెంబ్లీ ఉభయ సభలు ఆమోదించాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మందకృష్ణ మాదిగ చిత్రపటానికి మునుగోడు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ 30 ఏండ్ల కల నెరవేరిందన్నారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పిస్తూ వారి త్యాగాలను స్మరించుకుంటూ నినాదాలు చేసి పటాకులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నల్లగొండ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు పందుల మల్లేశ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు దుబ్బ గోపాల్, పందుల పర్వతాలు, పగడాల నాగయ్య, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు పందుల అశోక్, పందుల నరసింహ, పందుల భాస్కర్, జీడిమెట్ల రవీందర్, పందుల సంపత్, గోస్కొండ చిరంజీవి, జీడిమడ్ల సునీల్, సులేమాన్, దుబ్బ ప్రభాకర్, పందుల రాజేశ్, మేడి సైదులు, జీడిమడ్ల సురేందర్, బోయపర్తి యాదయ్య, పందుల ఉదయ్, పందుల లింగస్వామి, దుబ్బ ప్రమోద్, కురుమతి ముత్తయ్య పాల్గొన్నారు.