నల్లగొండ, అక్టోబర్ 28 : రెవెన్యూ విభాగంలో పలు హోదాల్లో పని చేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ సీసీఎల్ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నల్లగొండ స్థానిక సంస్దల అదనపు కలెక్టర్గా పని చేస్తున్న పూర్ణచంద్రతోపాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, పలువురు ఆర్డీఓలు బదీలీ అయ్యారు.
వారంతా మంగళవారం రిలీవ్ కానుండగా, ఇతర జిల్లాల నుంచి వారి స్థానంలో రానున్న అధికారులు నేడో, రేపో విధుల్లో చేరనున్నారు.