– మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
చండూరు, జనవరి 27 : అసంపూర్తి పనులు పూర్తి కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం చండూరు మున్సిపాలిటీలో చండూరు మున్సిపాలిటీ ఎన్నికల సమన్వయకర్త, సూర్యాపేట జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్‌తో కలిసి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అనే వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మున్సిపాలిటీలో కార్యకర్తలు, నాయకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభమై నేటికీ అసంపూర్తిగా వున్న దోభి ఘాట్, సమీకృత మార్కెట్, మున్సిపల్ భవనం, స్మశాన వాటిక అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నియోజక వర్గ ప్రజలకు బీరు, బిర్యాని రాజకీయాలు పరిచయం చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మద్యం అమ్మకాలపై నిబంధనలు పెట్టడం విడ్డురంగా ఉందన్నారు.
మద్యం అమ్మకాల సమయంపై ప్రభుత్వంతో మాట్లాడకుండా తన గుండాలతో వైన్స్ లపై దాడులు చేయించడం ఎందుకని ప్రశ్నించారు. రాని మంత్రి పదవి గురించి పదే పదే మాట్లాడటం కంటే యూరియా, పెన్షన్లు, యువతులకు ఇస్తామన్నా స్కూటీలు, పద్మశాలీల రుణ మాఫీ, త్రిఫ్ట్ రంగులు, నూలుపై సబ్సిడీలపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. తమ పార్టీ కార్యకర్తలను, ప్రజా ప్రతినిధులను బెదిరించి కాంగ్రెస్‌లో చెర్చుకోవడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తుండని, ఉద్యమ పార్టీలో ఉన్న తాము అటువంటి బెదిరింపులకు బయపడమన్నారు. రాష్ట్రంలో తక్కువ జనాభా ఉన్న చండూరును మున్సిపాలిటీగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చండూరు రూపురేఖలు మార్చాలని రూ.40 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రారంబించిన ఆయా పనులను ప్రస్తుత ఎమ్మెల్యే నేటికీ పూర్తి చేయలేకపోయారన్నారు. మున్సిపల్ ప్రజల తాగునీటి సమస్యను తీర్చడానికి రూ.12 కోట్ల అమృత్ నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. 30 పడకల ఆస్పత్రికి నిధులు మంజూరు చేసినా నేటికీ పనులు ప్రారంభించలేదు కానీ వంద పడకల ఆస్పత్రి అంటూ ఎమ్మెల్యే ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. తన రాజీనామా ద్వారానే నియోజకవర్గానికి నిధులు వచ్చాయంటున్న ఎమ్మెల్యే దమ్ముంటే మళ్లీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం నాంపల్లి మండలం నేరేళ్లపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త పొగాకు నగేష్ ఇల్లు ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోగా బాధితుడికి భరోసా ఇస్తూ, తక్షణ ఆర్థిక సహాయంగా కూసుకుంట్ల ప్రభాకార్‌రెడ్డి రూ.1.50 లక్షలు అందజేశారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొత్తపాటి సతీష్, మున్సిపల్ మాజీ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, రాష్ట్ర నాయకులు ఎత్తపు మధుసూదన్ రావు, మాజీ కౌన్సిలర్లు అనపర్తి శేఖర్, గుంటి వెంకటేశం, తేలుకుంట్ల జానయ్య, తేలుకుంట్ల చంద్రశేఖర్, మహిళా పట్టణ అధ్యక్షురాలు సంఘేపు సువర్ణ, మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, ఉపాధ్యక్షుడు కూరపాటి సుదర్శన్, అధికార ప్రతినిధి సతీష్ గౌడ్, మండల మహిళా అధ్యక్షురాలు పెండ్యాల గీత, మాజీ మండలాధ్యక్షులు పెద్దగోని వెంకన్న గౌడ్, ఇరిగి రామన్న ఇరిగి రామకృష్ణ, నకిరకంటి రామలింగం, చొప్పరి దశరథ, కళ్లెం సైదిరెడ్డి, రాపోలు జగదీష్, సామ యాదవ రెడ్డి, రామ్ గోపాల్, కొండ్రెడ్డి మల్లేశం, పోతరాజు ఎంకన్న, జెర్రీగా వెంకన్న, భూతరాజు గిరి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Chandur : ‘అసంపూర్తి పనులు పూర్తి కావాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలి’