తుంగతుర్తి, మార్చి 15 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తుంగతుర్తి మండలంలోని సంగెం గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర పెంచి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
నిత్యావసర ధరలను అదుపులోకి తెచ్చి పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జటంగి రవి, మండల నాయకులు మల్యాల రాములు, మాజీ ఎంపీటీసీ ఇలైజర్, మాజీ సర్పంచ్ జటంగి మల్లమ్మ, మల్లయ్య, శ్రావణ్, సామెల్, విజయ్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.