యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడో విడత పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఎలాం టి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ కొనసాగింది. ఈ మేరకు అధికార యం త్రాంగం ఏర్పాట్లు చేసింది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్యూలో నిల్చున్న వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. జిల్లాలోని ఆరు మండలాల్లో 114 సర్పంచ్ పదవులు, 993 వార్డు పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల వరకు 26.62 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత పోలింగ్ శాతం పుంజుకుంది. 11గంటల వరకు 56.59 శాతం, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 85.94 శాతం, అనంతరం 92.56 శాతం నమోదైం ది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

యాదాద్రి జిల్లాలో మూడో విడతలో 92.56 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం1,59,289 మంది ఓటర్లు ఉండగా, 1,47,432 ఓట్లు పోలయ్యా యి. 92.79 శాతంగా ఉన్న 73,640 మంది పురుషు లు, 92.33 శాతంగా ఉన్న 73,792 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలు నిర్వహించిన ఆరు మండలాల్లోనూ 90 శాతానికి పైగా రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదైంది. అత్యధికంగా చౌటుప్పల్ మండలంలో 94.25 శాతం మంది ఓటేశారు. ఆ తర్వాత గుండాలలో 92.83, సంస్థాన్ నారాయణపురంలో 92.44 శాతం, మోటకొండూరులో 92.28, అడ్డగూడూరులో 91.29 శాతం, మోత్కూరులో 90.11 శాతం మంది ఓటేశారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభించారు. తొలుత పోస్టల్ ఓట్లను లెక్కించారు. అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను తెరిచారు. వార్డులు, సర్పంచ్ ఫలితాల్లో కాం గ్రెస్, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు హోరాహోరీగా పోటీపడ్డారు. ఓట్ల లెక్కింపు ఆద్యం తం ఉత్కంఠగా కొనసాగింది. 2019 పంచాయతీ ఎన్నికల్లో మూడో విడతతో పోలిస్తే ఈసారి స్వల్పంగా పోలింగ్ శాతం తగ్గింది. పోయినసారి 94.06శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.

పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు, వారి ప్రతినిధులు ఎవరూ వియోత్సవ ర్యాలీలు జరుపుకోవద్దు. అన్ని దశల్లో ఎన్నికల ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా పోలింగ్ నిర్వహించాం. ఎన్నికల సంఘం నుంచి మార్గదర్శకాలు వచ్చే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. విజేతలు విజయోత్సవ ర్యాలీలు, బహిరంగ సమావేశాలు, ఊరేగింపులు జరుపుకోవద్దు. నియమ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు.
