– హాలియాలో నూతన సర్పంచులకు ఆత్మీయ సన్మానం
– హాజరైన ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్
హాలియా, డిసెంబర్ 20 : కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు, ఎన్నికల అధికారులు ఒకవైపు.. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరోవైపు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులు లేకుండా బైట తిరిగే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల కంటే పోలీసులు, ఎస్ఐలు ఎక్కువ పనిచేస్తున్నట్లు విమర్శించారు. శనివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియాలోని లక్ష్మీ గార్డెన్లో బీఆర్ఎస్ బలపరచగా ఎన్నికైన 60 మంది నూతన సర్పంచులకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమానికి జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కేసీఆర్ కారు గుర్తు వస్తదని.. అది అందరిని తొక్కుకుంటా పోతదన్నారు. ఈ రెండేళ్లలో నియోజకవర్గానికి ఏమీ పని చేశారో జానారెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్లా నాడే రాజకీయాలు తర్వాత గ్రామాలు అన్ని తమవే అని భావించి ఆ విధంగానే పరిపాలించినట్లు తెలిపారు. ఇప్పుడు ప్రలోభాలకు పాల్పడుతున్నట్లు దుయ్యబట్టారు. ఇచ్చిన ఇండ్లు కట్టాలి అంటే ఉన్నది అమ్మాలి అనే పరిస్థితి తలెత్తిందన్నారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పెద్ద పెద్ద నాయకులు రెండేళ్ల తర్వాత మీ వెంటే మేము అంటూ బీఆర్ఎస్లోకి వస్తారన్నారు.
నల్లగొండ జిల్లాలో ఎలక్షన్ అంటే రాజకీయ ఘర్షణలు ఉండేవి. కానీ కేసీఆర్ వచ్చినాక, 60 ఏండ్లు వారు చేయని అభివృద్ధి పదేండ్లలో అభివృద్ధి చేసి చూపించినట్లు తెలిపారు. పేద ప్రజల కోసం కేసీఆర్ ఏమీ చేసిండో అన్ని బంద్ చేసి కమీషన్ పథకాలు మాత్రమే తీసుకొస్తున్నట్లు తెలిపారు. కారు 100 కిలోమీటర్ల వేగంతో వస్తుందని.. చెయ్యి ఖతం అవుతాదని, దుర్మార్గ ప్రభుత్వంనికిదే పునాది అని తెలిపారు. కార్యక్రమ ప్రారంభానికి ముందు హాలియా పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు.

Haliya : వారంతా ఒకవైపు, బీఆర్ఎస్ మరోవైపు : మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

Haliya : వారంతా ఒకవైపు, బీఆర్ఎస్ మరోవైపు : మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

Haliya : వారంతా ఒకవైపు, బీఆర్ఎస్ మరోవైపు : మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి