– మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
– దేవరకొండలో బీఎల్ఓల శిక్షణా కార్యక్రమం
– హాజరైన బీఆర్ఎస్ రాష్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్
దేవరకొండ, జూన్ 16 : కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల ప్రయోజనార్థం అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఉండవని, కేవలం స్వప్రయోజనం లక్ష్యంగా దోచుకోవడాన్నే పథకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెట్టుకున్నట్లు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనను చూస్తుంటేనే తెలుస్తోందన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని సాయి శివ ఫంక్షన్ హాల్లో ఎస్.ఐ.ఆర్‌పై బీఎల్ఏల శిక్షణ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనన్నారు. సర్ అనే కార్యక్రమంతో ఓట్లను తొలగించే కార్యక్రమం కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వం చేపడుతుందని విమర్శించారు.
పశ్చిమబెంగాల్, బీహార్‌లో అలాగే జరిగిందని, దీంతో అక్కడ భారీ ఎత్తున ఓట్లను అక్రమంగా తొలగించారని ఆరోపించారు. అదే త్వరలో తెలంగాణ రాష్ట్రంలో సర్ అనే కార్యక్రమంలో ఓట్లను అక్రమంగా తొలగించే విధంగా చేస్తున్నారని అలా జరగకుండా ఉండేందుకు గ్రామాల్లో బీఎల్ఏ లు ప్రతిరోజు ఓటర్లను పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా దోచుకుంటుందని హైడ్రా పేరుతో ఎన్నో ఇండ్లను కుల్చినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రతి ఒక బీఆర్ఎస్ కార్యకర్త సైనికుడి వలె పనిచేసి మళ్లీ బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.

‘కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కీమ్లుండవు.. ఓన్లీ స్కామ్‌లే’
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. లంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒకటేనని, దీన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. కేంద్రం నుండి నిధులు తీసుకురాని సీఎం రేవంత్ రెడ్డి దద్దమ్మ అన్నారు. పొద్దున్నే లేస్తే కేసీఆర్‌ను తిట్టడమే తప్ప వేరే పని లేదన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మళ్లీ కేసిఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. మనమంతా కేసీఆర్ తయారు చేసిన సైనికులం కాబట్టి వచ్చే ఎన్నికల్లో సైనికుల వలె పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, చింతల వెంకటేశ్ రెడ్డి, బిల్య నాయక్, కిషన్ నాయక్, రమేశ్ నాయక్, సర్వయ్య, టీవీఎన్ రెడ్డీ, రవి కుమార్, ఆంజనేయులు, శంకర్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, వెంకట్ రెడ్డి, వల్లభ్ రెడ్డి, వెంకటేశ్ రావు, రూప్ల్ నాయక్, మధు, మురళి, అంజి గౌడ్, రవి, శివ, చిరంజీవి, గోపాల్, మోహన్, లోక్య నాయక్, రాజు పాల్గొన్నారు.

‘కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కీమ్లుండవు.. ఓన్లీ స్కామ్‌లే’