దామరచర్ల, మే 09 : నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని విజయశ్రీ జ్యువెలరీ షాపులో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. 30 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. దొంగలు మండల కేంద్రం బస్టాండ్‌లో గల జ్యువెలరీ షాప్ షట్టర్‌ను ఇనుపరాడ్‌తో పగులగొట్టి దుకాణంలోని బంగారు వస్తువుల బాక్స్ లను అపహరించుకుపోయారు. వీటితో పాటుగా సీసీ ఫుటేజీని ఎత్తుకెళ్లారు.
షాపు యజమాని బ్రహ్మయ్య పోలీసులకు సమాచారం అందించగా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, రూరల్ సీఐ ప్రసాద్, వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వేలి ముద్రలను సేకరించారు. రెండు నెలల క్రితం దామరచర్ల బస్టాండ్‌లో ఏటీఎం చోరీ చేసి దొంగలు రూ.23 లక్షలు అపహరించారు. వరుస దొంగతనాలతో గ్రామస్తులు భయాందోళనలకు గురైతున్నారు.