మాడ్గులపల్లి, మార్చి 18 : అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఎంపీ నిధులు రూ.5లక్షలతో మండల పరిధిలోని పాములపహాడ్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ సెంటర్ను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా అమలు చేసి రైతుల పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. పాములపహాడ్, భీమారం రోడ్డు పనులు, పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ, ఓఎస్డీ కళ్యాణ్ కుమార్, ఉపసర్పంచ్ గంగయ్య, ఎంపీటీసీ యాతం లింగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మోసిన్ అలీ, బాబయ్య, రాజు, మౌలాలీ, కోటిరెడ్డి, సైదులు, సంపత్, లింగయ్య, జానకిరాంరెడ్డి పాల్గొన్నారు.