బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల రెండో మోటర్ ద్వారా మంగళవారం ట్రయల్ రన్ చేశారు. చౌడంపల్లిలోని పంప్ హౌస్ నుంచి నీళ్లు దిగువకు పరవళ్లు తొక్కాయి. నీళ్లను చూసి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంతోషం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న స్థానికులు, రైతులతో కలిసి ఆనందం పంచుకున్నారు.
– నార్కట్‌పల్లి, మే 9
నార్కట్‌పల్లి, మే 9 : బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు రెండో మోటర్ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. నీటి పారుదల శాఖ అధికారులు మంగళవారం రెండో మోటర్‌ను ప్రారంభించారు. నీళ్లు ఒక్కసారిగా పరవళ్లు తొక్కగా.. రైతులు అక్కడికి చేసుకొని సంతోషం వ్యక్తం చేశారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నీటిని చూసి ప్రాజెక్టుతో తమ జన్మ ధన్యమైందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు యానాల అశోక్‌రెడ్డి, ఎంపీటీసీ రాజిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.