‘నిత్యం ప్రజల మధ్య ఉండి, సమస్యలను పరిష్కరించే నాయకుడిననే దేవరకొండ ప్రజలు గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారు. సీఎం కేసీఆర్ పాలనలోనే దేవరకొండను అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఆ నమ్మకాన్ని మరింత నిలబెట్టుకోగలిగాను. దశాబ్దాల నుంచి వెనుకబాటుకు గురైన దేవరకొండ నియోజకవర్గంలో సాగునీటి వసతి కల్పించేందుకు పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన డిండి ఎత్తిపోతల పధకానికి ప్రభుత్వం రూ.6,200 కోట్లు మంజూరు చేయగా, రూ.2,800 కోట్లు ఖర్చు చేసి నియోజకవర్గంలో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తున్నాం. 90 శాతం పనులు పూర్తి అయ్యాయి. ఎత్తయిన గుట్టల ప్రాంతాల్లో నివసిస్తున్న రైతుల పొలాల్లో నీళ్లు పారించేందుకు రూ.580 కోట్లతో 5 లిఫ్ట్‌లు ఏర్పాటుచేస్తున్నాం. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న గిరిజన పిల్లల చదువు కోసం 9 గురుకుల పాఠశాలలు, గిరిజన మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుచేశాం. 2 వేల కోట్ల రూపాయలతో ఆవాసాలకు సైతం రోడ్లు వేసి రవాణా సౌకర్యం మెరుగుపర్చుకున్నాం. ఈ అభివృద్ధి ముందుకు సాగాలంటే బీఆర్ఎస్ సర్కారుతోనే సాధ్యం. దేవరకొండ నియోజకవర్గ ప్రజలు, సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మరోమారు దేవరకొండ ఖిలాపై గులాబీ జెండా ఎగుర వేస్తాం’ అని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు. దేవరకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోమారు అవకాశం వచ్చిన నేపథ్యంలో నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు పంచుకున్నారు.
– దేవరకొండ, ఆగస్టు 31
దేవరకొండ, ఆగస్టు 31 : ‘ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. సబ్బండ వర్గాల సంక్షేమం కోసం అనేక వినూత్న పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవరకొండ నియోజకవర్గంలో రూ.2వేల కోట్లు వెచ్చించి ప్రతి ఆవాసానికీ రహదారులు మెరుగుపర్చుకున్నాం. ఎత్తైన గుట్టల ప్రాంతానికి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం 5 లిఫ్ట్‌ల ఏర్పాటు కోసం రూ.580 కోట్లు మంజూరు చేసింది. వాటి పనులు కొనసాగుతున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన డిండి ఎత్తిపోతల పథకానికి రూ.6200 కోట్లు మంజూరు చేయగా.. ఇప్పటికే రూ.2800 కోట్ల పనులు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో దేవరకొండ ఖిల్లాపై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయం’ అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే : దేవరకొండ నియోజకవర్గం గిరిజన తండాలు అధికంగా ఉన్న ప్రాంతం. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి పాలన చేరువ చేసింది. 2016లో కృష్ణా పుష్కరాల సందర్భంగా రూ.300 కోట్లతో అన్ని మండలాల రహదారులను మెరుగుపర్చుకున్నాం. దేవరకొండ పట్టణంలో రూ.100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టాం. రూ.5కోట్లతో ఏర్పాటు చేస్తున్న దేవరకొండ ఖిల్లా పార్కు పనులు చివరి దశలో ఉన్నాయి. నియోజకవర్గంలో 2గిరిజన బాలికల, 2 బాలుర, ఎస్సీ బాలుర బాలికల ఒకటి, 2 బీసీ, ఒక మైనార్టీ గురుకుల గిరిజన మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటయ్యాయి.
ఎమ్మెల్యే : 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 90 శాతం పూర్తి చేశాం. ప్రధానంగా చెప్పిన ప్రాజెక్టుల నిర్మాణ పనులు చివరి దశలో
ఉన్నాయి. త్వరలో పనులు పూర్తి చేసి సాగు నీరు అందిస్తాం. ఇప్పటికే నక్కలగండి ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి సాగునీరు అందించేందుకు కృషి చేస్తాం.
ఎమ్మెల్యే : 60 ఏండ్ల పాలనలో గత ప్రభుత్వాల హయాంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి కనిపించింది. రైతు బంధు ద్వారా సంవత్సరానికి రూ.250 కోట్లు నియోజకవర్గంలోని రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. రైతులు ప్రమాదంలో మరణించినప్పుడు రైతు బంధు ద్వారా బాధిత కుటుంబాలకు పరిహారం అందడంతో సంతోషంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో చేపట్టే రిజర్వాయర్లలో భూములు కోల్పోయిన బాధితులకు పరిహారం అందజేసి రైతులను ఆదుకుంటున్నాం. రాష్ట్రంలోనే అత్యధికంగా రిజర్వాయర్లు ఉన్న నియోజకవర్గం దేవరకొండ. వాటి పనులు పూర్తయితే ప్రతి ఎకరానికీ సాగునీరు అందుతుంది. గతంలో మంచినీటి కోసం మహిళలు రోడ్లు ఎక్కి ఆందోళన చేసేది. మిషన్ భగీరథ ద్వారా నియోజకవర్గంలో సుమారు రూ.500 కోట్లతో ప్రతి ఇంటికీ కృష్ణా జలాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. మిషన్ కాకతీయ కార్యక్రమంతో పూడిక తీయడంతో నేడు చెరువులు, కుంటల్లో నీరు పుష్కలంగా ఉన్నది. నేను నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకుడిని. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాటలను ప్రజలు నమ్మరు. నన్ను మరోసారి గెలిపిప్తే సమస్యలన్నీ పరిష్కరిస్తా.
ఎమ్మెల్యే : ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. నియోజకవర్గంలోని అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయి. సాగునీరు అందించేందుకు ఐదు ఎత్తిపోతల పనులు చేపడుతున్నాం. కొత్తగా గుడిపల్లి మండలం ఏర్పాటు చేశాం. అక్కడ నూతన భవనాలు ఏర్పాటు చేస్తాం. మండలాల నుంచి గ్రామాలకు రహదారులను మెరుగుపర్చేందుకు నిధులు తీసుకొస్తాం. రైతులకు రూ.లక్ష రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో ప్రచారంలోకి వెళ్లనున్నాం.
ఎమ్మెల్యే : 2018లో ప్రజలు ఇచ్చిన తీర్పును చూస్తే తమకు ఏ పార్టీ ప్రధాన పోటీ కాదు. రాబోయే ఎన్నికల్లో గత మెజార్టీ కంటే అధికంగానే వస్తుందనిపిస్తుంది. బీఆర్ఎస్కు పోటీనిచ్చే పార్టీలు కనుచూపు మేర కనిపించడం లేదు.