ఇమామ్ హసన్, ఇమామ్ హుస్సేన్ సహా పలువురి త్యాగాలను స్మరించుకుంటూ శనివారం జిల్లావ్యాప్తంగా మొహ్రరం వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా గ్రామాలు, పట్టణాల్లో పీర్ల ఊరేగింపును కోలాహలంగా నిర్వహించారు. హిందూ, ముస్లింలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామగిరి, జూలై 29: మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం వేడుకలు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని పాతబస్తీలో జరిగిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. పీర్ల ఊరేగింపులో పాల్గొన్నారు. సాయంత్రం పట్టణంలో జరిగిన ముగిం పు వేడుకల్లో యువత, ముజావర్లు చేసిన విన్యాసాలు అలరించాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, కౌన్సిలర్లు ఎడ్ల శ్రీను, అభిమన్యు శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీను, మైనార్టీ నాయకులు జమాల్‌ఖాద్రి, సయ్యద్ హాశం, సలీం పాల్గొన్నారు.
వేడుకల్లో పాల్గొన్న గుత్తా అమిత్‌రెడ్డి
నల్లగొండలోని పాతబస్తీలో మొహర్రం వేడుకల్లో గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయన వెంట ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, అయితగోని స్వామి, గోపాల్‌రెడ్డి ఉన్నారు.
హాలియా : మొహర్రం వేడుకలను మండ లంలో ఘనంగా జరుపుకొన్నారు. అనుముల మండలం చల్మారెడ్డిగూడెం, ఇబ్రహింపేట గ్రామాల్లో పీర్ల పీర్ల ఊరేగింపు చేపట్టారు. కార్యక్రమంలో ముజావర్లతో పాటు ముస్లిం మైనార్టీ నాయకులు అన్వర్‌ఖాన్, అంజత్‌ఖాన్, యూసూ ఫ్ ఖాన్, ఫేరోజ్, లతీఫ్, అఫ్రోజ్ పాల్గొన్నారు.
మాల్ : మొహర్రం వేడుకలను శనివారం మండలంలోని కిష్టరాయినిపల్లి, నసర్లపల్లి, గొడకొండ్లగ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. పీర్లను ఊరేగించగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, కిష్టారాయినిపల్లి సర్పంచ్ దొంతం చంద్రశేఖర్‌రెడ్డి పీర్లవద్ద పూజలు నిర్వహించారు.
దేవరకొండరూరల్ : మండలంలోని తాటికోల్, పడ్మట్‌పల్లి, ఇద్దంపల్లి, తెలుగుపల్లి, కొండభీమనపల్లి, కొమ్మేపల్లి గ్రామాల్లో భక్తి శ్రద్ధలతో పీర్లపండుగ జరుపుకొన్నారు. పీర్లకొట్టం వద్ద యువకులు ఆలవ్ ఆడారు. పీర్లకు మొక్కులు చెల్లించుకున్నారు. చివరి రోజు పీర్లను వీధుల్లో ఊరేగించి, నిమజ్జనం చేశారు.
కట్టంగూర్ : మండలంలోని అయిటిపాముల, బొల్లేపల్లి, ఈదులూరు, నారెగూడెం, కురమర్తి, మునుకుంట్ల గ్రామాల్లో పీర్లను ఊరేగించి నిమజ్జనం చేశారు. పిల్లలు, పెద్దలు కోలాటాలు, ఆటపాటలతో సందడి చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య, జడ్పీటీసీ తరాల బలరాములు, నాయకులు పాల్గొన్నారు.
చిట్యాల : మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన మొహర్రం వేడుకల్లో పీర్లను ఊరేగించారు. మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి పాల్గొని మొక్కులు చెల్లించుకొన్నారు.
శాలిగౌరారం : మొహర్రం వేడుకలను మండలంలోని పలు గ్రామాల్లో భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. పీర్లను గ్రామాల్లో ఊరేగించగా భక్తులు నీళ్లు ఆరబోసి మొక్కులు చెల్లించుకొన్నారు.
మునుగోడు : మండల కేంద్రంలో పీర్ల పండుగ శనివారం ఘనంగా నిర్వహించారు. భక్తులు పీర్లకు దట్టీలు సమర్పించి మొక్కు లు తీర్చుకున్నారు. తెల్లవారుజామున పీర్లచావిడి వద్ద భక్తులు అలావ్ ఆడారు. ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్య లో భక్తులు పాల్గొన్నారు.
నందికొండ : హిల్‌కాలనీలో పీర్ల పండుగను కౌన్సిలర్ రమేష్‌జీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పీర్లను కాలనీ వీధుల్లో ఊరేగించగా.. భక్తులు మొక్కలు చెల్లించుకొన్నారు. కార్యక్రమంలో వెంకటయ్య, జహంగీర్, మోహన్, చంద్ర య్య, రాజు, నిరంజన్, సత్తిబాబు, రాము పాల్గొన్నా రు.
మిర్యాలగూడ రూరల్ : మండలంలోని బాదలాపురంలో పూర్ల పండుగలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్లమోకల వెంకులు, శ్రీనివాస్, నాగయ్య, జహంగీర్, రహమత్ పాల్గొన్నారు.
దామరచర్ల : మండలకేంద్రంలో మొహర్రం వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. గ్రామంలోని పీర్లచావడిలో గ్రామస్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఏఎమ్‌సీ వైస్ చైర్మన్ కె. వీరకోటిరెడ్డి, ఎంపీటీసీ సోము సైదిరెడ్డి, పి. పెద్దకోటిరెడ్డి, డి. వెంకటేశ్వర్లు, బాల సత్యనారాయణ, పి. శ్రీనివాస్‌రెడ్డి, ఖాసీం, రఫీ పాల్గొన్నారు.
అడవిదేవులపల్లి : మొహర్రం వేడుకల్లో కోఆప్షన్ సభ్యుడు షేక్ బాబుజాని, మత పెద్దలు షేక్ బషీర్, సైదయ్య, కార్తీక్ పాల్గొన్నారు.
ఐక్యతకు ప్రతీక మొహర్రం : పల్లె రవికుమార్
చండూరు : మొహర్రం పండుగ ఐక్యతకు ప్రతీక అని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్ అన్నారు. మండలంలోని ఇడికుడ గ్రామంలో శనివారం నిర్వహించిన పీర్ల పండుగ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో వక్ఫ్‌బోర్డు మాజి డైరెక్టర్ ఘని, మాజీ సర్పంచ్ పంతంగి వీరయ్య, నాయకులు పరమేశ్, గిరి, రజాక్, సత్తార్, ఖాదర్, అలీ, ఆరిఫ్, జహంగీర్,ఫయాజ్ పాల్గొన్నారు.