మిల్లర్ల చిల్లర మోసం!
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని పలువురు మిల్లర్ల మోసం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నది. ఐకేపీ సెంటర్లలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లెకింపుల్లో మాయాజాలానికి పాల్పడుతూ రైతులను నిండా ముంచుతున్నారు. వీరి దోపిడీ లెకలు చూస్తే ఒకో లారీకి రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు కాజేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఐకేపీ మారెట్లలో సాధారణంగా 40 కిలోల ధాన్యం బస్తాలను తూకం వేస్తారు.
- రైతుల జేబుకు చిల్లు
- పోచంపల్లిలో బస్తాకు 5 కిలోల అదనపు తూకం
- ప్రతి 500 బస్తాలకు 25 బస్తాలు హాంఫట్
- లారీపై రూ.50 వేల నుంచి లక్ష వరకు దోపిడీ
- ఒకో అన్నదాతకు రూ. 20 వేలకు పైగా నష్టం
యాదాద్రి భువనగిరి, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని పలువురు మిల్లర్ల మోసం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నది. ఐకేపీ సెంటర్లలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లెకింపుల్లో మాయాజాలానికి పాల్పడుతూ రైతులను నిండా ముంచుతున్నారు. వీరి దోపిడీ లెకలు చూస్తే ఒకో లారీకి రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు కాజేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఐకేపీ మారెట్లలో సాధారణంగా 40 కిలోల ధాన్యం బస్తాలను తూకం వేస్తారు.
బస్తా బరువుతో కలిపి నిబంధనలకు అనుగుణంగా అధికారికంగా 41 కిలోల వరకు తూకం వేయాల్సి ఉంటుంది. అయితే మిల్లర్లకు నష్టం రాకూడదనే ఉద్దేశంతో రైతులు బస్తాకు 42 కిలోల వరకు తూకం వేసేందుకు ఒప్పుకుంటారు. అయితే మిల్లర్లు అన్నదాతల ఉదారతను ఆసరాగా తీసుకొని దోపిడీకి తెరలేపారు. తాజాగా ఇది 45 కిలోలకు చేరిందని రైతులు ఆరోపిస్తున్నారు. అంటే 40 కేజీల బస్తాలో 45 కిలోల ధాన్యం తూకం వేసి తమను నిండా ముంచుతున్నారని రైతులు వాపోతున్నారు.
500 బస్తాలకు 20 బస్తాలు కట్
ఒక్కో రైతుకు చెందిన ప్రతి 500 బస్తాల ధాన్యానికి ఏకంగా 20 నుంచి 25 బస్తాలను మిల్లర్లు కట్ చేస్తున్నారు. అంటే.. ఒక రైతు 500 బస్తాల ధాన్యం తూకం వేస్తే అందులో బస్తాకు 2 కిలోల చొప్పున అదనంగా పోయిన ధాన్యం కాకుండా, లెకించేటప్పుడు కేవలం 475 బస్తాలను మాత్రమే లెకలోకి తీసుకుంటున్నారు. అలాగే లారీలు మిల్లుకు చేరుకున్న అనంతరం అన్‌లోడింగ్‌లో జరిగితే మరో రెండు బస్తాలను అదనంగా కట్ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ లెక ప్రకారం ఒకో రైతు ఏకంగా 10 క్వింటాళ్ల ధాన్యాన్ని నష్టపోతున్నాడు. అంటే కేవలం ఒక రైతు నుంచే మిల్లర్లు దాదాపు రూ. 20 వేలకు పైగా వారి కష్టాన్ని అక్రమంగా దోచుకుంటున్నట్టే.
పెద్దలకో రూల్.. పేదలకో రూల్
పలు గ్రామాల్లో మిల్లర్ల దోపిడీ పేద, కౌలు రైతులపైనే ఎకువగా పడుతోంది. రాజకీయంగా పలుకుబడి ఉన్న వారు, గ్రామ పెద్దల విషయంలో మిల్లర్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తున్నది. వారి వద్ద నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తూకం వేస్తున్నట్లు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘మీ ధాన్యం కొనుగోలు చేయం.. ఇష్టం ఉంటే అమ్ముకోండి లేకపోతే లేదు’ అంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది. దీంతో రైతులు ఎకడ కొనుగోళ్లు ఆగిపోతాయోననే భయంతో మౌనంగా భరిస్తున్నారు.
మిల్లుల వద్ద ట్రక్ షీట్లు..?
మిల్లర్ల అక్రమాలతో నష్టపోయిన రైతులు మారెట్ కమిటీలను, గ్రామ పాలక వర్గాలను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోతోంది. మారెట్లో తూకం వేసేటప్పడు ట్రక్ షీట్లు ఇవ్వకుండా, ధాన్యం మిల్లుకు చేరిన తర్వాత మిల్లర్లు కట్ చేయగా మిగిలిన ధాన్యానికే ట్రక్ షీట్లు ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో ఓ వైపు వర్షాల భయంతో ఆందోళనతో ఉన్న రైతులను మిల్లర్లు, మారెట్ నిర్వాహకులు ఇలా నిండా ముంచుతున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

