టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం ఒక వీడియో విడుదల చేసింది. దానిలో మొజ్తబా ఎటువంటి గాయాలు లేకుండా, ఆరోగ్యంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఈ వీడియో ఎప్పటిదనే విషయాన్ని ఇరాన్ వెల్లడించలేదు. ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో తీవ్రంగా గాయపడినప్పటి నుంచి మొజ్తబా బహిరంగంగా కనిపించలేదు. ఆయన బతికే ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాడుల తర్వాత ట్రంప్ మాట్లాడుతూ మొజ్తబా 90 శాతం చనిపోయినట్లేనని ప్రకటించారు.