కోదాడ, జూన్ 02 : ఉద్యమ నేత కేసీఆర్ 14 సంవత్సరాల అలుపెరుగని పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్, సీనియర్ నాయకుడు పైడిమరి సత్యబాబు అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పరిష్కరించుకుని బీఆర్ఎస్ కోదాడ కార్యాలయంలో జాతీయ జెండా, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపినట్లు కొనియాడారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలంలోనే బ్రష్టు పట్టించిందని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు ఓటేశామని ప్రజల బాధపడుతున్నారని, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్వీ పట్టణాధ్యక్షుడు బొర్ర వంశీ నాని ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు, బస్టాండ్ ఆవరణలో దివ్యాంగులు, వృద్ధులకు, పేదలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మేదర లలిద, కందుల చంద్రశేఖర్, అలవాల వెంకట్, మామిడి రామారావు, కర్ల సుందర్ బాబు, గట్ల కోటేశ్వరరావు, సంగిశెట్టి గోపాల్, బత్తుల ఉపేందర్, కాసాని మల్లయ్య గౌడ్, షేక్ అబ్బు, ఆరీఫ్, షేక్ అలీమ్, లాజర్, బొర్రా వంశీ, బొజ్ఞా గోపి, నిస్సార్, కనగాల శ్రీధర్, తాజ్, జానీ, సోమపంగు నాగరాజు, చీమ శ్రీనివాసరావు, కర్ల నర్సయ్య, సిద్దెల రాంబాబు, కలకొండ వెంకటనారాయణ, కుడుముల సైదులు, నసిర్, మజాహార్ పాల్గొన్నారు.
Kodada : కేసీఆర్ అలుపెరగని పోరాటంతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం : ఎస్కే నయీమ్