ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
బొమ్మలరామారం, జూలై 4 : గిరిజనుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని వాలు తండా గ్రామంలో సోమవారం నిర్వహించిన ఎల్లమ్మ, ముత్యాలమ్మ, దుర్గమ్మ బోనాల పండుగలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంప్రదాయ గిరిజన దుస్తులు ధరించి ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంజారా తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.
అనంతరం ఇటీవల మరణించిన చీకటిమామిడి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు జూపల్లి బాలయ్య కుటుంబసభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని హామీనిచ్చారు. ఆమె వెంట ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోలగాని వెంకటేశ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సయ్య, మండల నాయకులు మచ్చ శ్రీనివాస్‌గౌడ్, గొడుగు చంద్రమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి రాంరెడ్డి, ధీరావత్ రాజన్‌నాయక్, మేడబోయిన గణేశ్, పాచ్య నాయక్ పాల్గొన్నారు.