డీలిమిటేషన్ జరిగితే.. పోటీ చేస్తా.. మీడియాతో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరుగుతుందని, దీంతో ఉన్న సీట్లకు 50 శాతం పెంచేలా కేంద్రం కొత్త విధానం ప్రతిపాదించిందని, 50 శాతం జనాభా, 50 శాతం జీఎస్టీ పరంగా చేయాలని పలు రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్నాయని, ఇది సాధ్యం కాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపాడ్డారు.
నీలగిరి, ఏప్రిల్ 15: జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరుగుతుందని, దీంతో ఉన్న సీట్లకు 50 శాతం పెంచేలా కేంద్రం కొత్త విధానం ప్రతిపాదించిందని, 50 శాతం జనాభా, 50 శాతం జీఎస్టీ పరంగా చేయాలని పలు రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్నాయని, ఇది సాధ్యం కాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపాడ్డారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమిలీ ఎన్నికలు నిర్వహించడమే మంచిదని, తొలి విడతగా దేశంలో 18 రాష్ట్రాల్లో జమిలీ ఎన్నికలు జరుగుతాయన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరిగాయని, ఆ పద్ధతిలో ఎన్నికలు జరిగితే సమస్యలు ఉండవని, కానీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు వేర్వేరుగా నిర్వహించడం వల్ల పరిస్థితులు మారుతున్నాయన్నారు. ముఖ్యంగా ఓటర్లు అభివృద్ధి చూసి ఓట్లు వేయడం లేదని, పైసలు పైసలే.. ఓట్లు ఓట్లే అన్నట్టు చూస్తున్నారని, ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నారు.
ధాన్యం కొనుగోళ్ల సమస్య పరిష్కారం..
జిల్లాలో రైసు మిల్లర్లతో చర్చలు జరిపామని కొనుగోళ్ల సమస్య పరిష్కారమైందన్నారు. తాలు ఎకువగా వస్తుండటంతో కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. మిల్లర్లు ఎదురొంటున్న ప్రధాన డిమాండ్లు నెరవేరిస్తే ధాన్యం కొనేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
లైనింగ్‌కు ముందే కాల్వల విస్తరణ చేపట్టాలి..
ఏఎమ్మార్పీ 4000 క్యూసెకుల నీరు సాగాలని, ఆ దిశగా కాల్వల నిర్మాణం జరిగిందన్నారు. కానీ ప్రస్తుతం 2400 క్యూసెకులకు మించి నీరు ప్రవహించే పరిస్థితి లేదని వాటిని విస్తరించడం వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

