కేతేపల్లి, అక్టోబర్ 18 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల నిలుపుదల పట్ల శనివారం జరిగిన బంద్కు మద్ధతుగా కేతేపల్లి మండలం భీమారంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేశ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలన్నారు. శీతాకాల సమావేశాల్లో 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బీసీ బిల్లు ప్రవేశపెట్టి 9వ షెడ్యూల్ లో చేర్చాలన్నారు.
ఈ రిజర్వేషన్ పెంపును వ్యతిరేకిస్తూ కొంతమంది నాయకులు కోర్టుల్లో పిటిషన్లు వేయడం ద్వారా బీసీ వర్గాల హక్కులను అడ్డుకునే ప్రయత్నం చేయడం శోచనీయం అన్నారు. సమ సమాజ స్థాపనకు ఉద్యోగులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నేటి బంద్కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.భిక్షమయ్య, గుర్రం వెంకట్ రెడ్డి, బత్తుల జానకి రెడ్డి, గుమ్మడవల్లి రమేశ్, గుండా వెంకటేశ్వర్లు, కన్నె శివయ్య, లగిశెట్టి శ్రీధర్, మేడం శేఖర్, పి.డి నాగయ్య, నరేందర్ రెడ్డి, సైదులు, జూనియర్ అసిస్టెంట్ సుమన్, అటెండర్ అహ్మద్, అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆయాలు పాల్గొన్నారు.