స్వామి వివేకానంద జయంతిని గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని 2కే రన్లు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం ఆవరణంలోని వివేకానందుడి విగ్రహానికి ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ పూల మాలలు వేసి నివాళుర్పించారు.
హాలియా, జనవరి 12 : ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానందుడు అని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక హాలియా పబ్లిక్స్కూల్లో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివేకానందుడి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులు, యువకులు వివేకానందుడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. అనంతరం పోలీస్‌శాఖ నిర్వహించిన వ్యాచరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్రావు, సీఐ గాంధీ నాయక్, ఎస్ఐలు క్రాంతికుమార్, శోభన్‌బాబు, మార్కెట్ చైర్మన్ జవ్వాజి వెంకటేశం, బీఆర్ఎస్ నాయకులు మల్గిరెడ్డి లింగారెడ్డి, పట్టణాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు నల్లబోతు వెంకటయ్య, ప్రసాద్ నాయక్, కోఆప్షన్ సభ్యులు రావుల లింగయ్య, అన్వరొద్దిన్, డోమినిక్, చాపల సైదులు, ఎన్నమల్ల సత్యం పాల్గొన్నారు.
యువత అన్ని రంగాల్లో రాణించాలి
నార్కట్‌పల్లి : యువత అన్ని రంగాల్లో రాణించాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పోలీసులశాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించిన 2కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మండలకేంద్రంలోని పలు వార్డుల్లో పర్యటించి అభివృద్ధి పనులపై ఆరా తీశారు. కార్యక్రమంలో సీఐ శివరామిరెడ్డి, ఎస్ఐ రామకృష్ణ, వార్డు సభ్యులు, యువకులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా 2కే రన్
స్వామి వివేకానంద జయంతిని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానందుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో 2కేరన్, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.
వివేకానందుడి మార్గం ఆచరణీయం అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా
రామగిరి, జనవరి 12 : స్వామి వివేకానంద సమాజానికి చూపిన మార్గం ఆచరణీయమని అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నల్లగొండలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న వివేకానంద విగ్రహానికి అదనపు కలెక్టర్‌తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ప్రముఖులు, అధికారులు, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా యువజ సర్వీసులు, క్రీడాలశాఖ అధికారి మక్భూల్అహ్మద్, జాతీయ యువజన అవార్డు గ్రహీత గంజి రాజేందర్, కౌన్సిలర్లు, పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.